18 July, 2026 | 12:55 AM

సెమీఫైనల్లో సింధు

18-07-2026 12:35 AM

గాయంతో తప్పుకున్న ఒకుహరా

జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్

టోక్యో: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో సెమీఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జపాన్‌కు చెంది న మాజీ ప్రపంచ చాంపియన్ నోజోమి ఒకుహరా గాయంతో మ్యాచ్ ప్రారంభానికి ముందే తప్పుకోవడంతో సింధుకు వాకోవర్ లభించింది.

దీంతో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత సింధు ఒక సూపర్ 750 టోర్నీలో సెమీఫైనల్స్‌కు అర్హత సాధించినట్లయింది. ప్రస్తుతం ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పీవీ సింధు సెమీఫైనల్లో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్, టోక్యో 2020 ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చెన్ యుఫెయ్‌తో తలపడుతుంది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో వరల్డ్ నెం.5 హాన్ యుయేను ఓడించిన సింధుకు ఇప్పుడు చెన్ యుఫెయ్ను రూ పంలో మరో కఠిన పరీక్ష ఎదురుకానుంది. ముఖాముఖి రికార్డుల్లో చెన్ యుఫెయ్ 8-6తో ఆధిక్యంలో ఉంది.

ఈ చైనా షట్లర్‌తో జరిగిన గత 4 మ్యాచ్‌లోనూ సింధు ఓడిపోయింది. 2019 బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపి యన్‌షిప్‌లో చెన్‌పై సాధించిన గెలుపే సిం ధుకు చివరిది, ఆ టోర్నీలోనే సింధు స్వర్ణం సాధించింది. కాగా ప్రస్తుత సీజన్‌లో చెన్ సూపర్ ఫాంలో ఉంది. దాదాపు ఈ ఏడాది ప్రతీ టోర్నీలోనూ ఆమె సెమీస్ చేరింది. జనవరిలో ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. మరోవైపు పీవీ సింధు కు ఈ ఏడాది మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత ఇది మూడో సెమీఫై నల్ మాత్రమే