18 July, 2026 | 12:44 AM

విండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్ కన్నుమూత

18-07-2026 12:34 AM

బార్బడోస్, జూలై 17: ప్రపంచ క్రికెట్‌లో విషాదం నెలకొంది. క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్రౌండ ర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్(89) కన్నుమూశారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ అసాధారణ ప్రతిభ కనబరిచారు. కేవలం 16 ఏళ్ల వయసులో బార్బడోస్ తరఫున ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన సోబర్స్, మరుసటి ఏడాదే వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 1958లో పాకిస్థాన్‌పై అజేయంగా 365 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

ఆ రికార్డును 1994లో మరో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అధిగమించాడు. 1968లో గ్లామోర్గన్‌పై జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు వరుస సిక్సర్లు బా దిన తొలి క్రికెటర్‌గా సోబర్స్ చరి త్ర సృష్టించారు. ఆ ఘనత ఆ యన కెరీర్‌లో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోయింది. సోబర్స్, తన కెరీర్‌లో 93 టెస్టులు ఆడి 8032 పరుగులు, 235 వికెట్లు తీశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ లో 383 మ్యాచ్‌లో 28 వేలకుపైగా పరుగు లు, 1000కు పైగా వికెట్లు సాధించారు. 1974లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. క్రికెట్‌కు చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో బ్రిటిష్ ప్రభుత్వం ఆ యనకు సర్ బిరుదును ప్రధానం చేసింది.