25 August, 2026 | 11:08 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

25-08-2026 10:06 AM

తిరుమల ఆగస్టు25(విజయక్రాంతి): తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 14 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. నిన్న 77,085 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 33,766 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ద్వారా రూ.4.61 కోట్ల ఆదాయం లభించింది.