రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డిఏవి విద్యార్థుల ఎంపిక
ఆసిఫాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కాగజ్‌నగర్ డి.ఏ.వి. లక్ష్మీపతి సింఘానియా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.అండర్–14 విభాగం ట్రయథ్లాన్ గ్రూప్–బిలో పాఠశాలకు చెందిన నిమిషా సర్దార్, మహమ్మద్ సైఫుద్దీన్ రజా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వారు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అంబదాస్ రావు, పి ఈ టి బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమన్నారు.రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ గుండం లక్ష్మణ్, కోచ్ విద్యాసాగర్ ఆకాంక్షించారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు అభినందించారు.






