15 August, 2026 | 2:54 AM

పోలీస్ అభ్యర్థుల వయోపరిమితి పెంపు

15-08-2026 01:59 AM

హైదరాబాద్, ఆగస్టు 14(విజయక్రాంతి): పోలీస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్, ఫైర్, జైళ్లు, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, ఫారెస్ట్ తదితర యూనిఫాం సర్వీసుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ జీవో జారీ చేసింది. ఐదేళ్ల వయోసడలింపునకు అదనంగా రెండేళ్ల సడలింపు వర్తించనుంది. దీంతో పోలీస్ గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 37 ఏళ్లు అర్హత కానుంది. నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.