3 August, 2026 | 9:28 PM

టీఎన్జీవో బోథ్ యూనిట్ అధ్యక్షునిగా శ్రావణ్ కుమార్

03-08-2026 08:12 PM

బోథ్,(విజయక్రాంతి): టీఎన్జీవోబోథ్. యూనిటీ అధ్యక్షుడిగా ఎస్ శ్రావణ్ కుమార్ ఎన్నికయ్యారు సెక్రటరీ రాకేష్ ఉపాధ్యక్షులుగా సాయి, కృష్ణ, కే రాము, బీమ్ సింగ్, పుష్పలతలు ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా బీచ్ చైతన్య పి శ్రీహరి, ఏ సుష్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏ సునీల్ కుమార్, కోశాధికారిగా ఏ మోహన్ బాపూజీ జి పబ్లిక్ సెక్రటరీగా కె రవి ఈసీ నెంబర్లుగా బి లక్ష్మి రాజేందర్ రాథోడ్ కృష్ణపాల్, విజయ్ కుమార్ ప్రభాకర్, సంతోష్, రమేష్ బాబురావు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జి.నితిన్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నూతన కమిటీని టీఎన్జీవో జిల్లా కార్యదర్శి ఏ నవీన్ కుమార్ సన్మానించారు. అనంతరం నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా గెలుపొందిన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. నూతన కమిటీ కాలపరిమితి 2029 వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల అబ్జర్వర్ గా అసూరి ప్రవీణ్ కుమార్, ఆదిలాబాద్ రూరల్ అధ్యక్షులు సహాయ ఎన్నికల అధికారిగా పవర్ సంజయ్ ,శరత్ లతోపాటు వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు.