3 August, 2026 | 10:33 PM

మొక్కలు నాటి సంరక్షణ చేయాలి

03-08-2026 09:18 PM

మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని గోప తండా గ్రామంలో జరిగిన గ్రామ సభ సందర్భంగా మొక్కలు నాటిన అనంతరం గ్రామ సర్పంచ్ భూక్య బిక్కు మాట్లాడుతూ గ్రామాలలో చెట్లు లేక ఎడారిగా మారుతున్నాయని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షణ చేయాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గ్రామ సర్పంచ్ నెరవేర్చారని గ్రామస్తులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాలోతు ఈశ్వరి రవి, గ్రామ కార్యదర్శి సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ శంకర్, గోపతండ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు శివ,గుగులోతు కిట్టు, భూక్య నవీన్, మాజీ ఎంపిటిసి శ్రీరాములు, వార్డు నెంబర్లు బాసు, పెరుగు లలిత, అంగన్వాడి టీచర్లు  దారమల్ల మంగమ్మ, పెరుగు రమాదేవి ఆశ వర్కర్లు, మల్టీపర్పస్ వర్కర్స్  తదితరులు పాల్గొన్నారు.