విద్యుత్ వైర్ తగిలి వ్యక్తి మృతి
03-08-2026 09:16 PM
సదాశివనగర్,(విజయక్రాంతి): మండలంలోని కుప్రియల్ గ్రామానికి చెందిన పెనుగొండ ఎల్లయ్య (55) ప్రమాదవశాత్తు పందుల నుంచి చెరకు పంటను రక్షించేందుకు వ్యవసాయ పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్ వైర్‌ను తాకడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు స్వీకరించి, దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు చేపడుతామని సదాశివనగర్ ఎస్ ఐ పుష్పరాజ్ తెలిపారు.






