3 August, 2026 | 10:34 PM

పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయింపు

03-08-2026 09:25 PM

సింగరేణి సంస్థ, మణుగూరు కు నూతన ఆశాకిరణం

సత్తుపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మినిమం అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ , ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆగస్ట్ 1 వ తేదీన వేలాది మంది కార్మికులతో సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో మణుగూరు డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణి సంస్థకు కేటాయించాలనీ చేసిన ఉద్యమ ఫలితంగానే సింగరేణి సంస్థకు పీ.కే ఓసి 2 డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ కేటాయించారని ఇది సింగరేణి కార్మికుల ఐక్యతకు , పోరాట స్ఫూర్తికి దక్కిన ఘన విజయం అని ఐఎన్టీయూసీ జాయింట్ జనరల్ సెక్రెటరీ తీగల క్రాంతి కుమార్ తెలిపారు.

తీగల క్రాంతికుమార్ మాట్లాడుతూ గతంలో తాడిచెర్ల 2 బ్లాకును కూడా సింగరేణికే కేటాయించాలని డాక్టర్ బి.జనక్ ప్రసాద్ నేతృత్వంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి  కిషన్ రెడ్డి ని కలిసి విన్నవించిన ఫలితంగా గత నెలలో తాడిచెర్ల-2 బ్లాక్ ను సింగరేణికే కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన డాక్టర్ బి.జనక్ ప్రసాద్ పికే ఓసి డీప్ సైడ్ బ్లాక్ కూడా సింగరేణికే కేటాయించాలని, సింగరేణికి కేటాయించకపోవడం వలన జరిగే అన్యాయాలను, సింగరేణికి సంస్థకు కలిగే నష్టాలను వివరించిన ఫలితంగా పికే ఓసి డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికే కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని వేలాది మంది కార్మికుల ఉద్యోగ భద్రత బలపడటమే కాకుండా , స్థానిక నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కలుగుతాయని తెలిపారు.

మణుగూరు ప్రాంతం మరోసారి పారిశ్రామిక అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది అని తెలుపుతూ ఐఎన్టియుసి సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే అన్ని బొగ్గు బ్లాక్ లను సింగరేణి సంస్థకు కేటాయించేంత వరకు ఐఎన్టీయూసీ యూనియన్ పోరాటం చేస్తుందని సింగరేణి సంస్థ బలోపేతం , కార్మికుల హక్కుల సంరక్షణ , కార్మికుల హక్కుల సాధనలో ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే ఐఎన్టియుసి యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేశారు.