20 August, 2026 | 4:03 PM

రాజీవ్ గాంధీకి నివాళులర్పించిన మంత్రి కోమటిరెడ్డి

20-08-2026 03:12 PM

నల్గొండ: భారత మాజీ ప్రధాని, దివంగత రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని రాజీవ్ గాంధీ విగ్రహానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశాభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణం కోసం రాజీవ్ గాంధీ చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అటు సచివాలయం ఎదురుగా మాజీ ప్రధాని, డిజిటల్ ఇండియా పునాదులు వేసిన దివంగత రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వి. హనుమంత్ రావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, లక్ష్మణ్ యాదవ్, రాపోలు జయప్రకాశ్ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.