20 August, 2026 | 3:55 PM

యూరియా పై బిఆర్ఎస్ కావాలనే దృశప్రచారం

20-08-2026 03:09 PM

గంభీరావుపేట, ఆగస్టు 20: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక యూరియా అంశంపై బీఆర్ఎస్ పార్టీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని గంభీరావుపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిమ్మల తిరుపతి గౌడ్ ఆరోపించారు. మండల కేంద్రంలోని పంతులు తోటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు పంటల కోసం అవసరమైన యూరియా సరిపడా అందుబాటులో ఉందన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని సూచించారు.

గంభీరావుపేట సింగిల్ విండో కార్యాలయం, కొత్తపల్లి సింగిల్ విండో కార్యాలయాలలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. కొంతమంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

ఎవరైనా రైతులకు యూరియా అందకపోతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మల్యాల రాజ్వీర్ నాయకులు బంగ్లా రాజు గౌడ్ ఎర్ర నరయ్య, వేషాల వెంకటి, శనిగరపు శంకర్, నరేష్ వర్మ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.