4 May, 2026 | 3:39 AM

సన్‌రైజర్స్‌కు షాక్

04-05-2026 02:20 AM
  1. కోల్‌కతా చేతిలో చిత్తు 
  2. రఘువంశీ హాఫ్ సెంచరీ 
  3. కేకేఆర్‌కు ౩వ గెలుపు

హైదరాబాద్, మే 3: ఐపీఎల్ 19వ సీజన్‌లో సన్‌రైజర్స్ జోరుకు బ్రేక్ పడింది. వరుసగా ఐదు విజయాలతో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదారాబాద్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజ ర్స్ కెప్టెన్ కమ్మిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎప్పటిలానే ఓపెనర్లు హెడ్ , అభిషేక్ శర్మ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్‌కు కేవలం 3.4 ఓవర్లలోనే 44 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ (15) ఔటైనా హెడ్, ఇషాన్ కిషన్ దూకుడు కొనసాగించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఈ క్రమంలో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.హెడ్ 28 బంతుల్లో 61 (9 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు.

అయితే కేకేఆర్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వరుస వికెట్లు తీసి సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టారు. సన్‌రైజర్స్ 19 ఓవర్లలో 165 పరుగులకు ఆలౌటైంది. నరైన్ 2 , వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీసారు. అటు ఛేజింగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రహానే, ఫిన్ అలెన్ తొలి వికెట్‌కు 4 ఓవర్లలోనే 49 పరుగులు జోడించారు. అలెన్ (29) ఔటైన తర్వాత రహానే, రఘువంశీ కోల్‌కతా ఇన్నింగ్స్ నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 84 పరుగులు జోడించడంతో కేకేఆర్ విజయం ఖాయమైంది. రహానే(42) ఔటైనా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రఘువంశీ దూకుడుగా ఆడాడు. చివర్లో రఘువంశీ (59) వెనుదిరిగినా గ్రీన్, రింకూ కోల్ కతాను గెలిపించారు. 

స్కోరు బోర్డు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 165 (హెడ్ 61, ఇషాన్ కిషన్ 42, అభిషేక్ శర్మ 15 ; వరుణ్ చక్రవర్తి 3/36, నరైన్ 2/31, కార్తీక్ త్యాగి 2/30 )

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 169/3 ( రఘువంశీ 59, రహానే 43, ఫిన్ అలెన్ 29 ; సాకిబ్ హొస్సేన్ 1/17, శివాంగ్ కుమార్ 1/31)