calender_icon.png 19 February, 2026 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారతీయ పౌరుషానికి నిలువెత్తు నిదర్శనం శివాజీ మహారాజ్

19-02-2026 05:42:23 PM

గేరిల్ల యుద్ధ తంత్రాలకు ఆధ్యుడు ఆయనే

గరిడేపల్లి ఫిబ్రవరి 19,(విజయ క్రాంతి): భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పౌరుషాలకు నిలువెత్తు ప్రతిరూపం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని గరిడేపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొండ సైదులు గౌడ్ అన్నారు.మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను గురువారం అంబేద్కర్ యూత్ అధ్యక్షులు అమరారపు శివాజీ,బండారు విజయ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడుతూ.మొగల్ సామ్రాజ్యవాదుల ఆగడాలను అరికట్టి మరాటి సామ్రాజ్యాన్ని నెలకొల్పిన బహుజన విప్లవ వీరుడు అని ఆయన చేసిన సేవలను కొనియాడారు.కార్యక్రమంలో ఎస్.కె చాంద్ మియా,పిడమర్తి హుస్సేన్,పిడమర్తి అంజి,బండార్ బిక్షం,బండారు అంజి,సైదులు,గురుస్వామి,వెంకట్ నర్సు,యూత్ కమిటీ సభ్యులు సందీప్,భరత్,రామ్ చరణ్,వీరబాబు,విజయ్,వెంకీ,నాని,బబ్లు,చింటు,నవనీత్,గౌతమ్ సాయి,ప్రశాంత్,చింటూ,శ్రీకాంత్,ఈశ్వర్,తేజ,వినయ్,సమీర్,నాగుల్, సలీం పలువురు పాల్గొన్నారు