calender_icon.png 12 February, 2026 | 11:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహా శివరాత్రి వేడుకలకు సిద్ధమవుతున్న శివ క్షేత్రాలు

12-02-2026 12:58:35 AM

  1. కంటోన్మెంట్‌లో 15న మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం
  2. మారేడుపల్లి సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయంలో 14న శివ కల్యాణ మహోత్సవ వేడుకలు
  3. మహీంద్రా హిల్స్ శ్రీ పహాడి హనుమాన్ మందిరంలో మహాశివరాత్రి వేడుకలు

సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి): మారేడుపల్లి శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 14వ తేదిన సాయంత్రం 6:30 నిమిషాలకు శివ కళ్యా ం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. కాగా 15న మహా శివరాత్రి పురస్కరించుకుని ఉదయం మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకం, మంగళహారతి, మంత్రపుష్పం, సంతత దారాభిషేకం, సాయంత్రం 108 కళాశాలతో కళాబిషేకం, రాత్రి 11 గంటలకు న్నాభిషేకం, అర్చన వంటి విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

మహాశివరాత్రి పురస్కరించుకొని పికెట్‌లో ప్రసిద్ధిగాంచిన శ్రీ పంచభూత భూమేశ్వర స్వామి శివ పంచాయతన శివాలయంలో ఈనెల 15న మహా శివరాత్రి మహోత్సవములు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధి జట్టి ఉమేశ్వరరావు తెలిపారు. అదే రోజు తెల్లవారుజామున ధర్మ ధ్వజారోహణం, రుద్రాభిషేకం, మహా మంగళహారతి , సప్తఋషిహారతి , జలాభిషేకం, సాయంత్రం మహా శివరాత్రి ప్రదోషకాల మహా కాల భైరవ 64 యోగిని భైరవుల అభిషేకం, కాగడ హారతి, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ,జాగారన్, వంటి పూజా కార్యక్రమాలతో పాటు నందగోపాల్ మ్యూజిక్ టీం వారిచే భక్తి గేయాలు వంటి కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

16వ తేదీ (సోమవారం) ఉదయం ఐదు గంటలకు అన్నాభిషేకం, కాగడ హారతి ,వంటి విశేష ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ నిర్వహకులు తెలిపారు. మహీంద్రాహిల్స్ శాంతినికేతన్ కాలనీలోని నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలకు శ్రీ పహడి హనుమాన్ మందిరం ముస్తాబవుతుంది విశాలమైన దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఎత్తున గుట్ట వద్ద 21 పీట్ల ఎత్తు అడ్డం కలిగిన భారీ విగ్రహానికి ముస్తాబు చేస్తున్నారు.

ప్రతి ఏటా భక్తులు అధిక సంఖ్యలో మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడికి విచ్చేస్తుండటంతో భక్తులకు తగిన సౌకర్యాలను ఆలయ నిర్వాహకులు ఏర్పా టు చేస్తున్నారు. గురు ఉన్న వివిధ స్వామి వార్త, అమ్మవార్త ఆలయాలను, గుట్ట వద్ద ఎత్తున ప్రదేశంలో విద్యుత్ కాంతుల నడుమ కొలువుదీరిన ఓంకార మహాశివుడిని దర్శించుకోవడానికి వేలాదిమంది భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.