ఆక్రమణకు గురవుతున్న శిఖం భూమి
భూమిని కొలతలు చేపట్టాలని సర్పంచు, గ్రామస్తులు డిమాండ్
ఉట్నూర్, జూన్ 7 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏమయికుంట పంచాయతీ కేంద్రంలోని గురు దేవ్ తలాబ్ కు చెందిన శిఖం భూమి అన్యాక్రాంతం కాకుండా కొలతలు చేసి అప్పగించాలని గ్రామస్తులతో పాటు సర్పంచ్ డిమాండ్ చేశారు.
ఆదివారం గురుదేవ్ తలాబ్ కు చెందిన సర్వేనెంబర్ 54లోని 5 ఎకరాల భూమిని సోలార్ ప్లాంట్ నిర్మాణం పేరుతో అక్రమించుకుంటున్నారని సర్పంచ్ జాదవ్ లకన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొమరయ్య, ఖానాపూర్ నియోజకవర్గం బీజేపీ కో కన్వీనర్ ఆరేల్లి రాజలింగు మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజుల నుండి సర్వేనెంబర్ 58 యజమాని కి ఎకరాలు 10.30 గుంటల భూమి పట్టా ఉంటే.. తన పట్టా భూమి అంటూ 54 సర్వే నెంబర్ లోని శిఖం భూమిని అక్రమించుకున్నారని ఆరోపించారు.
ఈ విషయంపై నీటి పారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ తో పాటు మండల తహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. గురుదేవ్ తలాబ్ నుండి ఏమాయి కుంట తో పాటు ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల తదితర పంచాయతీ ప్రజలు రాకపోకలు సాగించే రహదారిని సైతం నీటి పారుదల శాఖ డిప్యూటీ ఇంజనీర్ రాకపోకలు సాగించకుండా గుంతలు తవ్వేశారని వారు ఆరోపించారు.
సర్వే నెంబర్ 58 లో దాదాపు 1000 ట్రాక్టర్ల మొరం వేసుకున్న నీటి పారుదల శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని, రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా కట్ట పక్కన గుంతలు తవ్వడం అంటే ఏమిటని వారు ప్రశ్నించారు. సర్పంచ్ జాదవ్ లఖన్ మాట్లాడుతూ... గురుదేవ్ తలాబ్ కు చెందిన శిఖం భూమిని అక్రమనకు గురి అవుతుందని అధికారులకు వినతి పత్రం అందజేసిన ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదనతో తెలిపారు.
స్థానిక పోలీస్ స్టేషన్లో సైతం ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అక్రమంగా చేసిన వ్యక్తికి సహకరించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయంపై ఎస్త్స్ర సాయన్న మాట్లాడుతూ సర్పంచ్ ఫిర్యాదు చేశారని, ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు. రెవిన్యూ అధికారులు చూడవలసిన ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ తరపు నుండి రెవిన్యూ శాఖకు లేక పంపిస్తామని ఎస్త్స్ర తెలిపారు






