8 June, 2026 | 4:46 AM

మల్లన్న ఆలయ ఈవోగా కట్ట సుధాకర్ రెడ్డి

08-06-2026 12:56 AM

కొమురవెల్లి,(విజయ క్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ కార్య నిర్వహణ అధికారిగా కట్ట సుధాకర్ రెడ్డి ఆదివారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేస్తున్న ఈవో కృష్ణ ప్రసాద్ వరంగల్ జిల్లా దేవాదాయ శాఖ ఉప కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. కట్ట సుధాకర్ రెడ్డి కీసరగుట్ట దేవాలయంలో ఈవోగా పని చేస్తూ ఇక్కడికి బదిలీపై  వచ్చారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి చేస్తానని తెలిపారు.