calender_icon.png 10 February, 2026 | 2:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ష్..అంతా గప్ చుప్..!

10-02-2026 12:18:21 AM

  1. ప్రచారానికి తెర ప్రలోభాలకు శ్రీకారం

ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

మహబూబాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఉష్..ఇక అంతా గప్ చుప్.. ప్రచా రానికి తెరదించారు. ప్రలోభాలకు తెర తీశా రు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ము గిసింది. కొద్దిరోజులుగా వీధులన్నీ మైకుల రణగొణ ధ్వనులతో ఊదరగొట్టగా, ఇప్పుడు ప్రశాంతంగా మారిపోయాయి. ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇక ఓటర్లను ప్రలోభ పెట్టే కార్యక్రమానికి తెర లేపారు.

తమకు అనుకూలమైన వారు ఎం తమంది, ఇతరులు ఎంతమంది, తమ వార్డు ల్లో ప్రస్తుతం ఉన్న ఓటర్లు ఎంతమంది, ఇత ర ప్రాంతాల్లో ఉన్నవారు ఎంతమంది లెక్కదీసి , ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని తీసు కువచ్చి ఓటు వేయించుకునే పనిలో పడ్డా రు. ఓటుకు ఎంత పంచాలి.. ప్రత్యర్థి ఎంత ఇస్తున్నాడు.. మనమెంత ఇవ్వాలనే కార్యాచరణ పై తల మునకలయ్యారు. అధికార కాం గ్రెస్ తో పాటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలవడానికి వ్యూ హ ప్రతి వ్యూహాలు అమలు చేస్తున్నాయి. 

మద్యం అమ్మకాలు నిలిపివేత

ప్రచారంతోపాటు సోమవారం సాయం త్రం నుండి పోలింగ్ ముగిసేంతవరకు ము న్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్యం అమ్మకాలను నిలిపివేశారు. ఎక్సైజ్ అధికారులు మద్యం షాపులకు సీల్ వేసి అమ్మకాలు జరపకుండా చర్యలు తీసుకున్నారు. ఎక్కడ కూడా బహిరంగ ప్రచారం నిర్వహించినా ఎ న్నికల నిబంధన వ్యతిరేక చర్యగా భావించి చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

మహబూబాబాద్ జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్, కేసముద్రం, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్ ల పరిధిలో 98 వార్డులలో 1,27, 682 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టారు.

193 పోలింగ్ కేంద్రాలకు పిఓ, ఏపీఓ, ఓపిఓలతో పాటు 20 శాతం అదనంగా కలిపి 234 ప్రోసిడింగ్ అధికారులు, 234 అసిస్టెంట్ ప్రొసీడింగ్ అధికారులు, 697 ఓపి ఓలు, 386 పోలింగ్ బాక్సులు, 20 శాతం అదనంగా అందుబాటులో 281,  వెబ్ కా స్టింగ్ సీసీ కెమెరాలు, ప్రతి పోలింగ్ కేంద్రాలలో వయోవృద్ధులకు, దివ్యాంగులకు వీల్ చైర్స్ అందుబాటులో ఉంచారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామాగ్రి సిద్ధం చేశారు.

అలాగే పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రానికి తిరిగి తీసుకువచ్చి కౌంటింగ్ కేంద్రంలో భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించారు. ఓటర్లు నిష్పక్షపాతంగా ఓటు హక్కు వినియోగించుకో వడానికి అధికార యం త్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.