20 March, 2026 | 11:40 AM

శేష వాహన సేవ ఘనంగా నిర్వహణ

20-03-2026 12:00 AM

శ్రీరంగాపురం, మార్చి 19: నూతన పరాభవ నామ సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీరంగాపురం లోని శ్రీ రంగనాయక స్వామి దేవస్థానంలో ఉగాది ఆస్థానం వేడుక లు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడినట్లు ఆలయ పూజారు లు విష్ణు నారాయణ తెలిపారు .ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం పండుగ వాతావరణంలో కళకళలాడింది.

ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆలంకరణల అనంతరం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శేష వాహన సేవలో స్వామివారి అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

వేదమంత్రాల నాదం, మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి ఊరేగింపు నిర్వహించగా భక్తులు ‘జై శ్రీమన్నారాయణ‘ నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు.ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించారు.