ఘనంగా ఉగాది వేడుకలు
20-03-2026 12:00 AM
చారకొండ మార్చి 19 మండలంలోని అన్ని గ్రామాల్లో ఉగాది పండుగ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉగాది పురస్కరించుకొని గ్రామాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అపర భద్రాదిగా పేరుగాంచిన శిరుసనగండ్ల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, మండల కేంద్రంలోని శివాలయంతో పాటు పలు గ్రామాల్లోని దేవాలయాల్లో పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




