27 May, 2026 | 2:24 AM

యూరియా నీళ్ళు తాగి 19 గొర్రెలు మృతి

27-05-2026 12:22 AM

బిజినేపల్లి మే 26: మండలంలోని మామ్మాయిపల్లి గ్రామంలో యూరియా కలిసిన నీళ్ళు తాగి 19 గొర్రెలు మృతి చెందిన్నట్లు మండల పశు వైద్యాధికారి డా.జీవిత తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు అడివన్న, కార్తికలకు చెందిన 19 గొర్రెలుగా చనిపోయిన్నట్లు గుర్తించగ మరికొన్ని ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకున్నాయని అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్ళితే మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కార్తీక్, అడివన్నలు తమకు గల 200 వరకు గొర్రెలతో కలిసి ఆల్లీపూర్ గ్రామ గేట్ సమీపంలో మేతలకు వెళ్ళారు. స్థానికంగా వ్యవసాయం చేసే రైతులు మిగిలిపోయిన కొద్దిపాటి  యూరియా సంచులను అక్కడే గుడిసెలో వదిలి వెళ్లారు.

ఈదురు గాలులకు కొద్దిపాటి యూరియాతో ఉన్న సంచులు కొట్టుకొచ్చి ఒక గుంతలో నీళ్ళు మల్లుకున్నాయి. మధ్యాహ్నం సమయం ఆ గుంతలో ఉన్న యూరియా నీటిని 25 వరకు గొర్రెలు తాగాయి. నీటిని తాగిన గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. వెంటనే కాపరులు అప్రమత్తమై పశు వైద్యాధికారులకు సమాచారం అందించారు. వైద్యులు మిగిలిన గొర్రెలకు ప్రథమ చికిత్స అందించి రక్షించగా అప్పటికే పరిస్థితి విషమించిన 19 గొర్రెలు చనిపోయినట్లు పశు వైద్యాధికారి డా. జీవిత తెలిపారు.