27 May, 2026 | 1:34 AM

అటవీ శాఖలో పారదర్శక బదిలీలు

27-05-2026 12:23 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 26 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా జిల్లా అటవీ శాఖలో బీట్ అధికారుల బదిలీలు మంగళవారం పూర్తయ్యాయి.జిల్లా అ టవీ అధికారి బాలామణి ఆధ్వర్యంలో ఎఫ్డి ఓ అప్పయ్య, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్డిఓ వేణుబాబు సమక్షంలో జిల్లా కార్యాలయంలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు.జిల్లాలోని రెండు డివిజన్ల పరిధిలో మొత్తం 45 మంది బీట్ అధికారులు బదిలీకి అర్హత సాధించగా, వారికి 11 రేంజ్లలో 45 బీట్లను కేటాయించా రు.

ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న బీట్లలో సాధించిన సర్వీస్ మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించి బదిలీలు చేపట్టినట్లు డీఎఫ్వో బాలామణి తెలిపారు.బదిలీలను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అటవీ శాఖ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సిబ్బందిని కేటాయించినట్లు ఆమె వివరించారు.అంతకుముందు యూనియన్ నాయకులతో సమావేశమై వారి సూచనలు, సలహాలను స్వీకరించినట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌ఓలు, జూనియర్ ఫారెస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు యోగేష్ కులకర్ణి, సభ్యులు సాయిచరణ్, సద్దాం, స్వప్న, అనిల్, మోహన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.