చెరువులో పడి మృతి చెందిన శంకర్ మృతదేహం వెలికి తీత
30-05-2026 08:58 PM
మిర్యాలగూడ,(విజయక్రాంతి): మూడు రోజుల క్రితం ప్రమాదవశత్తు మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి చెరువులో పడి చనిపోయిన నూకల శంకర్(38) మృతదేహాన్ని శనివారం ఎన్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది వెలికి తీశారు. బుధవారం రాత్రి చేపల వేటకి వెళ్లిన శంకర్ ఆకస్మాత్తుగా వచ్చిన ఈదురు గాలులతో అదుపుతప్పి చెరువులో పడినట్లు తోటి మత్స్య కారులు తెలిపారు. మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసిన మిర్యాలగూడ గ్రామీణ ఎస్ఐ లక్ష్మయ్య విచారణలో చెరువులో పడినట్లు తెలియగా, ఎన్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది సాయంతో శుక్రవారం నుంచి పోలీసులు గాలింపు చేపట్టారు. శనివారం మృతదేహం లభించగా పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






