మారణాయుధంతో హాల్ చల్
పాత నేరస్తుడిని అరెస్టు చేసిన సరూర్ నగర్ పోలీసులు
ఎల్బీనగర్: మారణాయుధంతో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కలకలం సృష్టించింది. సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక పాత నేరస్తుడు కంట్రీ మేడ్ పిస్టల్‌తో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ వ్యక్తిని మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు, సరూర్‌నగర్ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ కు చెందిన మొహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు (22) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. భగత్‌సింగ్ నగర్‌లో మొహమ్మద్ ఇమ్రాన్ అలియాస్ ఇబ్బు కంట్రీ మేడ్ పిస్టల్‌తో తిరుగుతూ స్థానికులను భయపెడుతున్నాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఒక కంట్రీ మేడ్ పిస్టల్‌తో పాటు ఒక లైవ్ రౌండ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇమ్రాన్ పాత నేరస్తుడని, ఎల్బీనగర్ జోన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో ఆస్తి నేరాలకు సంబంధించిన అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు ప్రస్తుతం ఆయుధాలతో సంచరించిన ఘటనపై కేసు నమోదు చేసి, ఆయుధం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ ఉద్దేశంతో వెంట తీసుకెళ్తున్నాడనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.






