28 July, 2026 | 10:44 AM

ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

28-07-2026 09:58 AM

హైదరాబాద్: టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో(Tollywood film industry) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల(Pavala Shyamala passes away) మంగళవారం నాడు కన్నుమూశారు. ఆమె వయసు 75 సంవత్సరాలు. మంచి గుర్తింపు పొందిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గుండెపోటుతో మరణించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్యామల తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. పావలా శ్యామల గుంటూరు జిల్లా అమరావతిలో 1951లో జన్మించారు. పావలా శ్యామల అసలు పేరు నేతి న్యామల. గణేష్ పాత్రో రచించిన పావలా నాటకంలో నటన ద్వారా పావలా శ్యామలగా గుర్తింపు వచ్చింది. శ్యామల 44 ఏళ్లుగా అనేక నాటకాలు, సినిమాలు, సీరియళ్లలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పావలా శ్యామల స్వర్ణకమలం, కర్తవ్యం, దండోరా, ఇంద్ర, గోలీమార్, బలదూర్ సినిమాల్లో నటించారు. శ్యామల మృతిపట్లు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.