28 July, 2026 | 10:28 AM

ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా కొవ్వొత్తుల, కాగడాల ర్యాలీ

28-07-2026 09:33 AM

ఢిల్లీలో నీట్ విద్యార్థుల పై లాఠీ చార్జ్ హేయమైన చర్య... ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ఢిల్లీలో నీట్ విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి అక్రమ అరెస్టులు చేయటం హేయమైన చర్య అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల (వైకుంఠ ద్వారం) నుండి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వరకు  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య  ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, కాగడాలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీ తో ఎంతో మంది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని, ఢిల్లీలో జరిగిన ఆందోళనలో విద్యార్థుల పై లాఠీ చార్జ్ , వారిపై అక్రమ కేసులను పెట్టడం జరిగిందని అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు, విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ ర్యాలీలో మునిసిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కౌన్సిలర్లు  కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.