జూన్ 3న వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా మహాసభను విజయవంతం చేయాలి
మిర్యాలగూడ,(విజయక్రాంతి): తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) ఐజేయు అనుబంధ సంఘం జూన్ 3న నకిరేకల్లో జరిగే నల్గొండ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కలిమెల నాగయ్యలు కోరారు. శనివారం స్థానిక ఎన్ఎస్పి అతిథిగృహంలో టీయూడబ్ల్యూజే సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా మహాసభకు నకిరేకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ వేముల వీరేశం, రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి, టి యూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.రామ నారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పీ.ప్రభాకర్ రెడ్డిలు హాజరు కానున్నట్లు తెలిపారు. మహాసభకు జిల్లా లోని అన్ని మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మాజీ కార్యదర్శి ఎండి.అస్లాం, సీనియర్ నాయకులు పుప్పాల యాదగిరి, రంగా శ్రీనివాస్, నాగ చారి, బాలాజీరావు, శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి,రామకృష్ణ, అశోక్, వెంకన్న, రాచకొండ రమేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.






