calender_icon.png 24 February, 2026 | 2:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాడ్వాయిలో షబ్బీర్ అలీ దిష్టిబొమ్మ దహనం

24-02-2026 12:54:44 AM

తాడ్వాయి, ఫిబ్రవరి, 23( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో సోమవారం మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారుడైన షబ్బీర్ అలీ దిష్టిబొమ్మను బిజెపి నాయకులు దగ్ధం చేశారు. బిజెపి నాయకులు కామారెడ్డి,ఎల్లారెడ్డి  రోడ్డుపై బైఠాయించి షబ్బీర్ అలీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పై లేనిపోని ఆరోపణలు చేస్తూ కామారెడ్డిలో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షబ్బీర్ అలీ ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే రమణారెడ్డి కళాశాల భూములు ఆక్రమించాడని ఆరోపించారని తెలిపారు.

ఈ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే మీరు చేసిన ఆరోపణలకు సిద్ధంగా ఉన్నాను, మీ వద్ద ఉన్న డాక్యుమెంట్లు తీసుకొని రండి,నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు తీసుకుని వస్తాను అని సవాలు విసిరితే ఆ సవాలును స్వీకరించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో అలజడి సృష్టించారని నాయకులు మండిపడ్డారు. ఇప్పటికైనా షబ్బీర్ అలీ ఆరోపణలు మానుకొని వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు. షబ్బీర్ అలీ అక్రమాలకు పాల్పడి కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించడని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, నాయకులు గంగారెడ్డి, వెంకట్రావు, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు