25 August, 2026 | 2:58 AM

ఆధ్యాత్మికతతో దూరలవాట్లకు దూరం: మాజీ ఎంపీపీ

24-08-2026 10:45 PM

బోథ్,(విజయక్రాంతి): ఆధ్యాత్మిక చింతనతో దురలవాట్లకు దూరంగా ఉంటారని మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కనుగుట్ట గ్రామంలో శబరీ మాత ఆశ్రమంలో నిర్వహిస్తున్న అఖండ జ్యోతి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రజలలో భక్తి భావన పెరగడంతో పాటు ఐక్యత సోదర భావం పెరుగుతుందన్నారు.

గ్రామస్తులు చేపట్టిన కార్యక్రమం వల్ల ఇతర గ్రామాలకు ఆదర్శంగా ఉంటుందన్నారు. కాగా గ్రామస్తుల కోరిక మేరకు చివరి రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకుల అనిత రాజేందర్, ఉప సర్పంచ్ మల్లయ్య ఆశ్రమ కమిటీ అధ్యక్షులు కుమ్మరి భోజన్న, బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు అల్లకొండ ప్రశాంత్, గంగమల్లు భక్తులు పాల్గొన్నారు