27 May, 2026 | 4:29 AM

స్కై బార్‌ని తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన

27-05-2026 12:00 AM

మిర్యాలగూడ, మే 26 :పట్టణం లోని హౌసింగ్ బోర్డు కాలనీలో విద్యాసంస్థలు నివాస గృహల నడుమ నూతనంగా ప్రారంభించిన స్కై బార్ ని తక్షణమే తొలగించాలని ఎస్ ఎఫ్ ఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్డివో కార్యాలయం ఎదుట ధర్నా చేసి నిరసన తెలిపి మాట్లాడారు. బార్ కి అతి సమీపంలో లిటిల్ ఫ్లవర్ పాఠశాల ఉందని నిత్యం వందలాది మంది విద్యార్థులు అక్కడ నుండి రాకపోకలు సాగిస్తారన్నారు.

బార్ కి వచ్చే వినియోగదారులు వాహనదారుల వల్ల తీవ్ర ఇబ్బంది కలుగుతుంది అన్నారు. త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్నందున ఉన్నతాధికారులు, ఎక్సైజ్ అధికారులు స్పందించి అక్కడ నుంచి బార్ ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కుర్ర సైదా నాయక్ , వదూద్, రమేష్ రంగా,తులష్యా, లచ్ఛిరాం తదితరులు పాల్గొన్నారు