27 May, 2026 | 3:22 AM

నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్

27-05-2026 12:00 AM

ఎస్పీ నరసింహ 

కోదాడ, మే 26: అలవాటుగా నేరాలకు పాల్పడితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం, జిల్లా భహిష్కరణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. కోదాడ పట్టణం కేంద్రంలో కాశీనాదం పంక్షన్ హల్ నందు కోదాడ డివిజన్ స్థాయి పాత నేరస్థులకు, గంజాయి కేసుల్లో ఉన్న నిందితులకు, సస్పెక్ట్ షీటర్స్ కు మంగళవారం నిర్వహించిన పరివర్తన, సత్ప్రవర్తన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేరాలకు పాల్పడితే సమాజంలో వ్యక్తిగత గౌరవం తగ్గుతుంది.

క్షణికావేశంతో నేరాలకు, దాడులకు పాల్పడితే భవిష్యత్తులో సమస్యలు తప్పవు, నేరానికి పాల్పడితే ఏనాటికైనా చట్టపరమైన కఠిన శిక్షలు పడతాయని తెలిపారు. చిన్న చిన్న తప్పులు, నేరాలు చేసి జైలు పాలవకుండా జీవితాన్ని ఆస్వాదించాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలన్నారు. గణపవరం గ్రామంలో జరిగిన యువకుని సాంకేతిక కోణంలో దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశాం అని తెలిపారు. ముస్లిం సోదరులు జరుపుకొనే బక్రీద్ పండుగ త్యాగాలకు, మత సామరస్యానికి ప్రతీక అని ముస్లిం సోదరులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలినారు.

కోదాడ డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ శివ శంకర్, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు, డివిజన్ లో పని చేస్తున్న ఎస్‌ఐ లు పరమేష్, అజయ్ కుమార్ నవీన్ కుమార్, సుదీర్ కుమార్, హనుమా, సతీష్ రెడ్డి, కోటేష్, అజయ్, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.