11-02-2026 02:00:13 AM
ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష...
ఆదిలాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈ నెల ౧౮న జిల్లా వ్యాప్తంగా ఘనంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, సంఘం పెద్దలతో జయం తి ఏర్పాట్లపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం సేవాలాల్ జయంతి వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి మార్గదర్శకుడిగా నిలిచారని, ఆయన జయంతి వేడు కలను గౌరవప్రదంగా నిర్వహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. గిరిజన తండా ల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ట్రాఫిక్ రద్దీ నివారణకు అవసరమైన మళ్లింపులు చేపట్టాలని సూచించారు. సేవాలాల్ మహారాజ్ బోధనలు, ఆయన సమాజ సేవలను యువతకు తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. ఈ సమావేశంలో ఐటిడిఎ పీఓ యువరాజ్ మర్మట్, గిరిజన సంక్షేమ శాఖ, పోలీస్ శాఖల అధికారులు, బంజారా సంఘాల నాయకులు పాల్గొన్నారు.