calender_icon.png 16 February, 2026 | 10:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి

16-02-2026 12:00:00 AM

మోతె, ఫిబ్రవరి 15:-మండల పరిధిలోని గోపతండా గ్రామంలో ఆదివారం శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని గ్రామ సర్పంచ్ భూక్య బిక్కు ,ఆలయ కమిటీ చైర్మన్ గుగులోతు (కిట్టు) రామోజీ ఆధ్వర్యంలో, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రాంజీనాయక్ తండాలో జన్మించారు. సేవాలాల్. తండ్రి భీమానాయక్, తల్లి ధర్మిణి బాయి సేవాలాల్ పశువులను మేపడానికి వెళ్లే వారు. తల్లి తనకిచ్చిన చద్దిని ఆకలితో ఉన్నవారికి పెట్టి, అడవిలో దొరికే బంకమట్టితో రొట్టెలు చేసి తినేవారని అన్నారు.       

గోర్బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని, సేవాలాల్ విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించాలని , సేవాలాల్ జయంతి రోజైనా ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించి, జయంతి ఉత్సవాలు నిర్వహించాలని బంజారాలు కోరుతున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మాలోతు ఈశ్వరి రవి, డీలర్  సీతారాములు, మాజీ ఎంపిటిసి శ్రీరాములు, వార్డ్ మెంబర్ లు పెరుగు లలిత రమేష్, కోర్ర లక్పతి, అశ్విని రామోజీ, బాసు, రాములు (యాపీ), గ్రామ యూత్ అధ్యక్షుడు భగవాన్, వినోద్, నవీన్, మోహన్ అశోక్, కోటి,బి.నాగు, కోర్ర భగ్గులాల్, గుగులోతు బాలునాయక్, గ్రామ బంజారా నాయకులు  పాల్గొన్నారు.

కూచిపూడి తండాలో 

కోదాడ, ఫిబ్రవరి 15: కోదాడ మండలంలోని కూచిపూడి తండా గ్రామంలో సంత్ సద్గురు సేవలాల్ మహారాజ్ జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. అనంతరం భోగ్ బండారో కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా యువకులు సేవలాల్ మహారాజ్ బోధనలు, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.

సూర్యాపేటలో

సూర్యాపేట, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి) : బంజార జాతిని ఐక్యం చేసి సన్మార్గంలో నడిపిన మహానీయుడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ అని గిరిజన సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ మంగ్తా నాయక్, సంత్ శ్రీ సేవాల్ లాల్ మహరాజ్ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ లానావత్ పాండు నాయక్ లు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బంజార్ భవన్ లో సంత సేవాలాల్ జయంతి సందర్భంగా  కో-కన్వీనర్ గుగులోతు నాగు నాయక్ అధ్యక్షతలో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.

నాడు సంచార జీవనం కొనసాగిస్తున్న లంబాడీలను గిరిజనుల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహారాజ్  హింస, మద్యపానం, ధూమపానం వంటి వాటిని వీడి ప్రతీ ఒక్కరికి హింధూధర్మం గురించి చెప్పి వారిని చైతన్యం చేశారని చెప్పారు. పాలకులు లంబాడీలను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు. లంబాడీల సహకారంతో జిల్లా కేంద్రంలో నిర్మాణం చేపట్టిన ఈ బంజార భవన్ పూర్తి నిర్మాణాన్ని ముందుకు సాగించేందుకు సహాయ సహకారాలు అందించా లని కోరారు.

అంతకు ముందు సేవాలాల్ మహరాజ్ భోగ్ బండార్ కు ప్రత్యేక నైవేద్యం వండి స్వామివారికి సమర్పించి  లంబాడీలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాలు నాయక్, డిప్యూటి తహసీల్దార్ ఎల్ లావణ్య, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, కౌన్సిలర్లు, రాజకీయ పార్టీల నాయకులు, బంజార ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నాయకులు, బంజారలు తదితరులు పాల్గొన్నారు.

నూతనకల్‌లో

నూతనకల్, ఫిబ్రవరి 15:మండల పరిధిలోని బక్క హేమ్లాతండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆధ్యాత్మిక గురువు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలను పురస్కరించుకొని ‘భోగ్ బండార్‘ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.గ్రామ సర్పంచ్ గుగులోత్ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవాలాల్ మహారాజ్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన ఆశయాలను గౌరవించాలని కోరారు. తండా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ భోగ్ బండార్ నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నేనావత్ సురేందర్ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షులు కేతావత్ మంగత్య నాయక్, తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా ప్రతినిధి మూడ్ మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.