30 April, 2026 | 4:16 PM

బీజేపీలో ఆప్ ఏడుగురు ఎంపీల విలీనం

28-04-2026 12:30 AM
  1. రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం 
  2.   113కు చేరిన బీజేపీ బలం.. మూడుకు పడిపోయిన ఆప్ బలం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: బీజేపీలో ఏడుగు రు ఆప్ ఎంపీల విలీనానికి రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు. దీం తో రాజ్యసభలో బీజేపీ సంఖ్య 113కు చేరిం ది. ఆప్ సంఖ్య మూడుకు పడిపోయింది. రాఘవ్‌చడ్డా, హార్బజన్ సింగ్, స్వాతి మాలీవాల్ సహా ఏడుగురు ఆప్ రాజ్యసభ సభ్యులు ఇటీవల ఒకేసారి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వారంతా ప్రస్తుతం బీజేపీలో విలీనమయ్యారు.

ఈ విలీనం తర్వాత తమను బీజేపీ ఎంపీలుగానే పరిగణించాలని కోరుతూ.. సదరు ఏడుగురు ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు వినతిపత్రం ఇచ్చారు. తాజాగా దానిని ఆయన ఆమెదించారు. రాజ్యసభ అధికారిక వైబ్‌సైట్ ప్రకారం.. ఈ ఏడుగురు ఆప్ ఎంపీలు ఇప్పుడు బీజేపీ స భ్యుల జాబితాలో ఉన్నారు. కాగా పార్టీ మా రిన ఈ ఏడుగురు ఎంపీల సభ్యత్వన్ని రద్దు చేయాలని కోరుతూ ఆప్ ఆదివారం రాజ్యసభ చైర్మన్‌కు వినతి పత్రం ఇవ్వడం గమనార్హం.