21-02-2026 09:54:39 PM
బంజారా సమాజానికి మార్గదర్శకుడు సేవాలాల్
స్థలాన్ని పరిశీలించండి ఎమ్మార్వో కు సూచన
వైరా ఎమ్మెల్యే అడిషనల్ కలెక్టర్
కారేపల్లి,(విజయక్రాంతి): బంజారా సమాజానికి మార్గదర్శకుడు సంతు సేవాలాల్ అని ఆయన ఆశయాల సాధన కోసం బంజారాలు పాటుపడాలని వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ లైవ్ రాష్ట్ర నాయకులు శంకర్ జాదవ్ అన్నారు. మండల కేంద్రమైన కారేపల్లి ఎమ్మార్వో ఆలయం సమీపంలో శనివారం సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకలు కమిటీ సభ్యులు బానోతు హిరాలాల్ బానోత్ బాలు నాయక్ కమిటీ పర్యవేక్షణలో మండల తాసిల్దార్ ఈ రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా భోగి బండార్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూసంత్ సేవాలాల్ బంజారా సమాజానికి మార్గదర్శకుడు, హిందూ ధర్మ గొప్పతనాన్ని తెలియజేసిన మహానుభావుడని చెప్పారు. అందరి క్షేమం కోసం పోరాడిన వ్యక్తి అని గ్రామాల్లో ప్రజలు బాగుండాలని ఆయన సంకల్పం ఉన్నారు. పోరాట యోధులను విస్మరించవద్దని ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వీస్ ఇస్తేనే అధికారులు ఉన్నత స్థానం పొందుతారని అన్నారు. మండల కేంద్రమైన కారేపల్లి లో సేవాలాల్ జయంతి వేడుకలకు ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించాలని ఎమ్మార్వో ను ఆదేశించారు.
రాబోయే సంవత్సరం ఆ స్థలంలోని జయంతి వేడుకలు నిర్వహించాలన్నారు. తన నిధుల నుండి 10 లక్షల రూపాయలు కేటాయించనున్నట్లు తెలిపారు.ప్రతి గిరిజన సమూహం ముఖ్యమైనదని గుర్తింపు కోసమే పోరాడాలన్నారునేటి సమాజంలో విద్య ప్రధానమైన అంశమని ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. విద్యతో చదువు సంస్కారం అలబడుతుందన్నారు.
చిన్ననాటి నుంచే జగదాంబ భక్తుడిగా నిలిచిన సేవాలాల్ మహారాజ్ గోవుల సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చారని, గుత్తి ప్రాంతంలో కరువు రావడంతో కర్ణాటకలోని బళ్లారి వైపు వలస వెళ్లినట్లు చరిత్రలో చెప్పుకుంటారని వివరించారు. బంజారా జాతిని ఆపదల నుంచి రక్షించేందుకు పాటించాల్సిన ఆచారాలు, పూజించాల్సిన దేవతల గురించి దేశమంతా తిరిగి ప్రచారం చేశాడని తెలిపారు. లంబాడ ఐక్యవేదిక సభ్యులు ఎమ్మెల్యే రాందాస్ నాయకులు గజమాలతో సత్కరించారు. అనంతరం మండలంలోని 41 గ్రామ పంచాయితీ సర్పంచులను ఎంపీ ఓ రవీంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో ఎమ్మెల్యే శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఐటీడీఎడీడీడీ విజయలక్ష్మి బీసీ ఎస్సీ డిడి జ్యోతి ఐటీడీఏ డిడి విజయలక్ష్మి ఇరిగేషన్ డీఈ వెంకన్న ఆర్డబ్ల్యూసీఐ ఈ ఎస్ నరేందర్ కారేపల్లి రూరల్ సిఐ సాగర్ ఎస్సై బి గోపి ఏ పీఎం పి. వెంకటేశ్వర్లు, ఏపీవో బి.కోటేశ్వరరావు, మండల స్థాయి అధికారులు, 41 గ్రామపంచాయతీల సర్పంచులు, బానోత్ హిరాలాల్,మెదరి వీరప్రతాప్ టోనీ, కార్యదర్శులు, నాయకులు పగడాల మంజుల, మాజీ సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ దేవుల నాయక్ పెద్ద బోయిన ఉమా శంకర్, బానోతు రామ్మూర్తి నాయక్, అడ్డగోడ ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.