సెస్ ది అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
విలీనం చేసై ఊరుకోమంటున్న రైతులు
కరీంనగర్ /సిరిసిల్ల 8(విజయక్రాంతి): గ్రామీణ విద్యుద్దీకరణలో అంతర్జాతీయ గు ర్తింపు పొందిన సిరిసిల్ల సహకార విద్యుత్ స రఫరా సంఘం ( సెస్) 1970 నవంబర్ 1న ప్రారంభమైంది. సభ్యుల వాటాధనంతో ఏర్పాటు చేసిన ఈ సంస్థను కలుపుకుని ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం తొమ్మిది సహకార విద్యుత్ సరఫరా సంఘాలుండేవి. కాలక్రమేణా అవన్నీ బోర్డులో విలీనమయ్యాయి.
కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని సంస్థను బోర్డులో కలుపకుండా, సహకార సంస్థగా కొనసాగేలా కృషి చేశారు. జిల్లా ప్రజల కోరిక మేరకు ‘సెస్’ను కాపాడుతూ వస్తున్నారు. మెరుగైన సేవలందిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. పలుసార్లు అవార్డులు కూడా అందుకున్నది. ప్రస్తుతం సెస్ పరిధిలో సిరిసిల్ల, వేములవాడ,చొప్పదండి, మానకొండూర్ నియోజ కవర్గాలు ఉన్నాయి. 13 మండలాల్లోని 255 గ్రామ పంచాయతీల్లో సేవలందుతున్న తరుణంలో విలీన ప్రయత్నాలు మొదలైనాయి.
దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న సిరిసిల్ల సెస్పు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వివక్ష చూపుతున్నదని పాలజవర్గం మండిపడుతోంది. ఐదేండ్లకోసారి చేయాల్సిన రెన్యువల్ను పెండింగ్లో పెట్టింది. గడువు ముగియడంతో తాజాగా ఎన్పీడీసీఎల్ రంగంలోకి దిగి సెస్ను ఆధీనంలోకి తీసుకోవడం విలీన కుట్రకు బలం చేకూరుస్తున్నది. సెస్ పాలకవర్గాన్ని పక్కనపెట్టి, ఏప్రిల్01 నుంచి టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్ ఆధ్వర్యంలో కార్యకలాపాలు ప్రారంభించారు.
ప్రాణాలు పణంగా పెడుతాం..చిక్కాల రామారావు, సెస్ చైర్మన్
సహకార విద్యుత్తు సరఫరా సంఘం సిరిసిల్ల (సెస్)ను ప్రాణాలు ఫణంగా పెట్టి అయి నా కాపాడుకుంటాము, విలీనానికి ఒప్పుకోబోము. సెస్ లైసెన్స్ కోసం డిసెంబర్లోనే ప్రభుత్వానికి పంపించాము, మార్చి 31 గడువు ముగియగానే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్టీపీసీఎల్ అధికారులు సెస్ కార్యాలయంలో చొరబడి, పోలీస్ బలగం పెట్టుకొని మీటింగ్లు పెట్టారు.
ఇప్పటి వరకు లైసెన్స్ రెన్యువల్ ఎందుకు పెండింగ్ పెట్టిందో చెప్పలేదు, తమకు నోటీసులు ఇవ్వకుండానే సెస్లో చొరబడ్డారు. 1969లో అప్పటి రాజకీయ ప్రత్యర్థులైన దివంగత ఎమ్మెల్యేలు చెన్నమనేని రాజేశ్వర్రావు, జువ్వాడి నర్సింగరావు ఇక్కడి మెట్టప్రాంతమైన సిరిసిల్ల రైతులు, చేనేత కార్మికుల కోసం దేశంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సహకార విద్యుత్తు సరఫరా సంస్థను స్థాపించారు.
సెస్ 56 ఏండ్లుగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రపంచ వ్యాప్తం గా మన్ననలు పొందిందనది. నష్టాల్లో ఉందని, అవినీతి అంటూ దుష్ప్రచారం చేస్తూ పథకం ప్రకారం విలీనానికి కుట్రకు తెరలేపారు. ఘనకీర్తి ఉన్న సిరిసిల్ల సెస్ను కాపాడుకుంటాం, సెస్ పాలకవర్గంతోపాటు ప్రతినిధులు, వినియోగదారుల సహకారంతో న్యాయ పోరాటం చేస్తాం.




