పదవీ విరమణ పొందిన హెడ్ కానిస్టేబుళ్లకు గణ సన్మానం
పోలీస్ శాఖలో వారి సేవలు చిరస్మరణీయం: అదనపు ఎస్పీ చంద్రయ్య
సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా పోలీస్ కార్యాలయంలోని డీసీఆర్‌బీలో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణయ్య, కొనరావుపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ మహబూబ్ అలీ పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ చంద్రయ్య ఇద్దరు అధికారులను శాలువాలతో సన్మానించారు.
పోలీస్ శాఖలో వారు సుధీర్ఘకాలం అంకితభావంతో నిజాయితీగా విధులు నిర్వహించి శాఖకు మంచి పేరు తీసుకువచ్చారని కొనియాడుతూ అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖలో వారి సేవలు చిరస్మరణీయమని, పదవీ విరమణ అనేది ఉద్యోగానికి మాత్రమేనని,వ్యక్తిత్వానికి కాదని అదనపు ఎస్పీ తెలిపారు.పదవీ విరమణ అనంతరం కూడా కుటుంబానికి లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు వచ్చినా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.






