8 June, 2026 | 7:03 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

రామ్‌చరణ్ ‘పెద్ది’ విడుదల సందర్భంగా సేవ

04-06-2026 12:22 AM

అలంపూర్ జూన్ 3: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా చిరంజీవి యువత ఆధ్వర్యంలో రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదల సందర్భంగా బుధవారం సేవా కార్యక్రమం నిర్వహించారు. రాజోలి మండలం తుమ్మలపల్లె గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం పవన్ కుమార్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి రామ్ చరణ్ అభిమానులు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ నిషాక్ మాట్లాడుతూ, చిరంజీవి సేవా స్ఫూర్తిని అభిమానులు కొనసాగించడం అభినందనీయమని అన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలని పిలుపునిచ్చారు. అఖిల భారత చిరంజీవి యువత తాలూకా అధ్యక్షుడు శివరామయ్య, ఉపాధ్యక్షులు మాదుగుండు రాము, వాహిద్ మాట్లాడుతూ... పవన్ కుమార్ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా నిలుస్తామని, పిల్లల విద్య కోసం సహకారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.   చిరంజీవి యువత సభ్యులు సగరే బాబు, భాష, డాక్టర్ రవి, దినేష్, చాకలి మద్దిలేటి, మహేశ్వర్ రెడ్డి తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.