రాహుల్‌కు సీనియర్ల సెగ
- ప్రధాని మోదీ చర్యలు సరైనవే అని ప్రకటన
రాహుల్ అవకాశవాది: బీజేపీ
ఢిల్లీ, ఏప్రిల్ 4: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, దేశంలో ఎల్పీజీ సరఫరాపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్ర ధాని మోదీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే పలువురు ప్ర ముఖులు భిన్నంగా సామాజిక మాధ్యమా ల్లో పోస్టులు పెట్టి, మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైనవే అనడం రాహుల్ కు సెగ తగిలినట్లవుతుంది.
సొంతపార్టీ సీనియర్ నేతలే ఓ వైపు భారత విదేశాంగ విధా నాన్ని కొనియాడుతున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఆనంద్ శర్మ, కమల్ నాథ్ వంటి సినీయర్ నాయకులు తమ తమ అభిప్రాయాలు వ్యక్తపరిచారు. కేంద్రం బాధ్యతాయు తమైన రాజనీతిని ప్రదర్శిస్తుందని శశిథరూ ర్ స్పందించగా, యుద్ధ ప్రభావం దేశం పడకముందే కేంద్ర ప్రభుత్వం దౌత్యపరంగా వ్యవహరించిన తీరును కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ అభినందించారు.
దేశంలో పెట్రోల్, డిజిల్, ఎల్పీజీ కొరతలేదని మాజీ సీఎం కమల్ నాథ్ అన్నారు. యుద్ధం విషయంలో కేంద్రం సరైన నిర్ణయాలే తీసుకుంటోందని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ అన్నారు. రాహుల్ గాంధీ అవకాశవాది అని, దేశానికి ఎప్పుడూ వ్యతిరేకంగానే వ్యవహరిస్తారని, అందుకే కాంగ్రెస్ నాయకుల్లో చాలామంది ఆయన్ను వ్యతిరేకిస్తారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ఎద్దేవా చేశారు.
తమ స్వలాభం కోసం భయాందోళనలు సృష్టించడం ఇకనైనా ఆపాలని కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. పహెల్గామ్ దాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’పై కూడా రాహుల్ గాంధీ ఇలాం టి ప్రశ్నలే సంధించి అభాసుపాలయ్యారు, పలువురి ఆగ్రహానికి గురయ్యారు.




