26 May, 2026 | 1:01 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

థరూర్ కాన్వాయ్‌పై దాడికి యత్నం

05-04-2026 01:23 AM
  1. నేను క్షేమంగానే ఉన్నా.. ఆందోళన పడొద్దు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తిరువనంతపురం, ఏప్రిల్ 4: కేరళలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కాన్వాయ్‌ను అడ్డగించి దాడికి ప్రయత్నించారు. దీంతో ఆయన భద్రతా బృందంలోని ఒక సభ్యుడిపై దాడి జరిగినట్లు ఆరోపణలున్నాయి. యూ డీఎఫ్ అభ్యర్థి ఏపీ అనిల్ కుమార్ తరఫున ప్రచారం చేసేందుకు థరూర్ వాండూర్ వెళుతుండగా ఈ ఘటన జరిగింది. థరూర్ బృందం రెండు వాహనాల్లో ప్రయాణిస్తుండగా, 8 మంది ఈ వాహనాలను అడ్డగించా రు. దీన్ని వ్యతిరేకించిన భద్రతా బృందంలోని సభ్యుడు జోక్యం చేసుకున్నాడు. దీం తో అతనిపై దాడి జరిగినట్లు సమాచారం.

పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నా రు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో రాజకీయ కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం థరూర్ తన సామాజిక మాధ్యమంలో మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతూ తాను క్షేమంగానే ఉన్నానని,  ఆందో ళన పడొద్దని చెప్పారు. కేరళ ఎన్నికల్లో యూడీఎఫ్ మెజార్టీ సాధిస్తుందని థరూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. గెలిస్తే సీఎం ఎవరన్న ప్రశ్నకు బదులిస్తూ, కాంగ్రెస్ హైకమాం డ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.