పోటీకి దూరంగా కమల్
- డీఎంకే కూటమికి మద్దతు ప్రకటన
- దరఖాస్తు రుసుం ఇచ్చేయాలంటున్న అభ్యర్థులు
చెన్నై, ఏప్రిల్ 4: ఎంఎన్‌ఎం పార్టీ అధినేత, ప్రముఖ నటుడు కమల్‌హాసన్ తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటంతో పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నది. కనీసం 10 నుంచి 15 సీట్లు కావాలని తమ పార్టీ గుర్తు టార్చ్ లైటుతో పోటీ చేస్తామని డిమాండ్ చేశారు. ఇప్పటికే కమల్‌కు రాజ్యసభ సీటు ఇవ్వడంతో అన్ని సీట్లు ఇవ్వలేమన్న డీఎంకే కావాలంటే తమ గుర్తు ‘ఉదయ సూర్యుడు’తో పోటీకి దిగాలని సూచించారు.
ఈ ప్రతిపాదనపై ఇటు ఎంఎన్‌ఎంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడంతో పోటీకి దూరంగా ఉండి, డీఎంకే కూటమికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ ను కమల్ హాసన్ పొగడడం పట్ల ఎంఎన్‌ఎం పార్టీలో ని పలువురిని తీవ్ర నిరాశకు గురిచేసింది. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీలో ఒక్క సీటూ గెలవని కమల్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమికే అవకాశమిస్తూ పోటీ చేయలేదు.
కాగా తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహ అభ్యర్థుల నుంచి కమ ల్ దరఖాస్తులను తీసుకున్నారు. ఒక్కో అభ్య ర్థి పార్టీకి రూ. 50వేల చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇలా మొ త్తం 60 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. చివరలో కమల్ పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆశావహులు తీవ్ర నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పోటీకి దిగనప్పుడు తాము చెల్లించిన డబ్బును వెనక్కు ఇచ్చేయాలనే కోరుతున్నారు.




