calender_icon.png 20 February, 2026 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అస్వస్థత

20-02-2026 12:08:21 PM

హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డి(Tatiparthi Jeevan Reddy) ఫుడ్ పాయిజనింగ్ కారణంగా అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో ఆహారం తీసుకున్న జీవన్ రెడ్డికి గురువారం రాత్రి వాంతులు, విరేచనాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని  కుటుంబీకులు తెలిపారు. తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలపై జీవన్ రెడ్డి టీ కాంగ్రెస్ నేతలపై కోపంగా ఉన్నారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి 20 టికెట్లు, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్ వర్గానికి 30 టికెట్లు ఇవ్వండపై జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.