21 March, 2026 | 7:44 AM

పాఠాలు బోధించి.. అధికారులుగా వ్యవహరించి!

21-03-2026 01:01 AM

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మార్చి20: మండల పరిధిలోని కాసర్లపహాడ్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రాజకీయ నాయకులుగా, ఉపాధ్యాయులుగా, ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా బాధ్యతలు నిర్వర్తించి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బాలునాయక్, సర్పంచ్ మంచాల లలితారామ్మూర్తి, ఉపసర్పంచ్ శ్రీనివాస్, ఏఏపీసీ చైర్మన్ నూర్జాబేగం, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు దబ్బేటి యాదగిరి, భూపతి శ్రీనివాస్, పుష్పలత, నాయకులు కూరాకుల యుగేందర్, కొంగర సంజీవ, అజారుద్దీన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.