ఒకే గదిలో ఐదు తరగతులు
ఇబ్బందుల్లో హుస్సేన్‌పూర్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు
కొడంగల్, మార్చి 20 (విజయక్రాంతి): కొడంగల్ మండల పరిధిలోని హుస్సేన్ పూర్ ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఒకే గది ఉండటంతో ఉపాధ్యాయులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రు. పాఠాలు చెప్పాలన్న, హెచ్‌ఎం కార్యాలయ పనులు నిర్వహించాలన్న ఇబ్బందులు పడాల్సి వస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు క్రాంతికుమార్ తెలిపారు. పాఠ శాలలో ఒకటి నుండి ఐదొ తరగతి వరకు మొత్తం 52 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల తరగతి గదిలో ఓ మూలకు హెచ్‌ఎం కార్యాలయం నిర్వహిస్తున్నారు.
పాఠశాల సామాగ్రి సైతం గది లోనే ఉంది. ఉదయం వేల టీచర్ గదిలో, వరండాలో హెచ్‌ఎం విద్యార్థులకు బోధన చెప్పాల్సి వస్తుంది దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇబ్బందులు కలుగు తున్నాయి. పాఠశాల తరగతి గదికి అనుకొని శిథిలావస్థలో పెచ్చులూడిన మరో గది ఉన్నది.
ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్తులు బిక్కు బిక్కున చూస్తు న్నారు. పాఠశాల ముందు విశాలమైన ఖాళీ ప్రదేశం ఉంది. అందులో అదనపు తరగతి గదులు నిర్మిస్తే సమస్యకు పరిష్కారం అవుతుందని ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు తెలిపారు. ప్రభుత్వం తరఫున విద్యాశాఖ ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పాఠశాల తరగతి గదులను నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.




