పలు పాఠశాలల్లో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మండలంలో ఉన్న ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఏపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వనిపాకలల్లో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... భవిష్యత్తులో ఉన్నత ఆశయాలను అలవర్చుకోవాలి.
స్వయం పరిపాలన దినోత్సవంలో ఏ పదవులు అయితే చేపట్టారో భవిష్యత్తులో అదే పదవులు చేపట్టి కలలను సాకారం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉరుమడ్ల ప్రాథమిక పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్ధన్, ప్రధానోపాధ్యాయులు ఆర్.వెంకన్న, ఏపూర్ జడ్పిహెచ్ఎస్ హెచ్ఎం పాలెం పరమేష్, జడ్పిహెచ్ఎస్ ఉరుమడ్ల ప్రధానోపాధ్యాయులు బోధనం మోహన్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




