క్రీడా పాఠశాలకు ఎంపిక పోటీలు
16-03-2026 04:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్ వారి ఆధ్వర్యంలో జిల్లాలో క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ అర్బన్ మండల స్థాయి సెలక్షన్స్ నిర్వహించారు. దీనికి నాలుగవ తరగతి అర్హులైన క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఇందులో అన్ని టెస్టులను నిర్వహించి ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని జిల్లా స్థాయికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. మండల విద్యాశాఖ అధికారి పద్మ మేడం అలాగే పిడి సత్తయ్య భూమన్న తదితరులు పాల్గొని వీటిని నిర్వహించడం జరిగింది.




