24 June, 2026 | 1:44 AM

రాష్ట్ర క్రీడా పాఠశాలకు వెంపటి పాఠశాల విద్యార్థుల ఎంపిక

24-06-2026 12:38 AM

తుంగతుర్తి, జూన్ 23 : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంపటి నుండి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి 4 విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలకు ఆదిలాబాద్ క్రీడా పాఠశాలకుపుల్లూరు శివకేశవ, కరీంనగర్ క్రీడా పాఠశాలకుమాచర్ల సహస్ర క్యాస్ట్రో, వరంగల్ క్రీడా పాఠశాలకుమడి పెద్ది వివేక్, రామనబోయిన ఈషఎంపిక కావడం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీవనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,పాఠశాలలో చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం,

విద్యార్థులలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని,తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలలో ప్రవేశం పొందడం ద్వారా విద్యార్థులకు ఉన్నత స్థాయి క్రీడా శిక్షణ, ఆధునిక సౌకర్యాలు, నిపుణుల పర్యవేక్షణలో సాధన చేసే అవకాశం లభించనుందని, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిల్లో రాణించే అవకాశం వచ్చిందని,పాఠశాల విద్యార్థులు రాష్ట్ర క్రీడా పాఠశాలకు ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందని,విద్యార్థుల కృషి,తల్లిదండ్రుల సహకారం,ఉపాధ్యాయుల అంకితభావం కలిసి ఈ విజయాన్ని అందించాయని అన్నారు

విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి, విద్యార్థులను అభినందించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు,గ్రామం నుండి రాష్ట్ర స్థాయి క్రీడా పాఠశాలలకు విద్యార్థులు ఎంపిక కావడం గర్వకారణం అని భవిష్యత్తులో వీరు రాష్ట్రం,దేశం గర్వపడే క్రీడాకారులుగా ఎదగాలని కోరుకుంటున్నామని తల్లిదండ్రులు అన్నారు,ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూవిద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు పాఠశాల స్థాయిలో నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్నామని, విద్యతో పాటు క్రీడల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేకచొరవతీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం మల్లెపాక రవీందర్, గట్టు మాధవి, నిమ్మరబోయిన నవీన, బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోత్ కృష్ణ, గుండ్ల ఆంజనేయులు, ప్రీ ప్రైమరీ టీచర్ రామనబోయిన మౌనిక, ఆయా అబ్బ గాని మంజుల, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.