దొంగలను త్వరలో పట్టుకుంటాం
24-06-2026 01:43 AM
జిల్లా ఎస్పీ జానకి షర్మిల
భైంసా జూన్ 23 ( విజయక్రాంతి)నిర్మల్ జిల్లా బా సర అమ్మవారి ఆలయంలో చోరీకి పాల్పడ్డ దుండగులను త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. బాసరను సందర్శించి దొంగతనం తరిగిన తీరిపై అడిగి తెలుసుకున్నారు. ఇది మహారాష్ట్ర మూట సబ్యుల పని అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాలను సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిం చుకుని దొంగలను పట్టుకున్నందు కు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో దొం గతనాలు నియంత్రణకు పోలీస్ శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు ఉన్నారు.






