24 August, 2026 | 6:37 PM

కేంద్రం నన్ను అడ్డుకున్నా.. నా లక్ష్యాన్ని అడుకోలేరు

24-08-2026 05:26 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రికి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం 4 కోట్ల ప్రజలకు జరిగిన అవమానమని, తెలంగాణ సీఎంను అడ్డుకోవటం అంటే రాష్ట్రం అభివృద్ధిని అడ్డుకోవటమే అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతో ఆ రాష్ట్ర సీఎం అమెరికాలో ర్యాలీలు చేశారని, అంతేకాకుండా పెట్టుబడుల కోసం గుజరాత్ సీఎం అమెరికాలో 8 రోజులు పర్యటించారు. తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని కేంద్రం, ప్రధాని మోదీ పదేపదే ప్రదర్శిస్తోందని, తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను గుజరాత్ కు మళ్లించుకునేందుకు కుట్ర చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు.

 నన్ను అడ్డుకోవటం గుజరాత్ ఆధిపత్యానికి నిదర్శనమని, రాజకీయ వివక్షతో తెలంగాణను మోదీ అడ్డుకుంటున్నారని, కేంద్రం వైఖరిపై రాష్ట్ర బీజేపీ నేతలు నోరెత్తకపోవటం మరింత అవమానం అని అన్నారు. కేంద్రం నన్ను అడ్డుకున్న నా లక్ష్యాన్ని అడుకోలేరని, డిసెంబర్ లో ప్యూచర్ సిటీలో పెట్టబడుల సదస్సు నిర్వహిస్తామన్నారు.  హైదరాబాద్ లో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తామని, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని గుజరాత్ నాయకత్వం కుట్ర చేస్తోందని ఆయన వెల్లడించారు. మన రాష్ట్రంపై గుజరాత్ ఆధిపత్యాన్ని అందరూ ఖండించాలని, నా విదేశీ పర్యటనలో ఎలాంటి గోప్యత లేదని, నా పర్యటన మొత్తం షెడ్యూల్ ను విదేశాంగశాఖ ముందుంచినట్లు తెలిపారు. ఒక సీఎం విదేశాలకు వెళ్తే విదేశీ రాయబారులు వెంటే ఉంటూ ప్రతి కార్యక్రమాన్ని భారత రాయబార అధికారులు పర్యవేక్షిస్తారు.