27 July, 2026 | 9:47 PM

అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి

27-07-2026 08:47 PM

భైంసా,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఎంజేపీటీబీ సీడబ్ల్యూ ఆర్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల లో అతిథి అధ్యాపకులు పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్.సి.ఓ. ఉమ్మడి ఆదిలాబాద్ ఎస్. శ్రీధర్, డిసిఓ నిర్మల్, డా. జీవన్ కుమార్ కె, సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 30న గురువారం ఉదయం 10 గంటలకు నిర్మల్ లోని ఎంజేపీటీబీ సీడబ్ల్యూఆర్ (బాలుర)  స్కూల్, జూనియర్ కళాశాల డెమో తీసుకోవడం జరుగుతుందన్నారు. బాలుర కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ కెమిస్ట్రీ-1, బాలికల కళాశాలల్లో జూనియర్ లెక్చరర్ కామర్స్-1 మరియు ఫిజికల్ డైరెక్టర్-2 పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు స్వీకరించే స్థలం:ఎంజేపీటీబీ సీడబ్ల్యూ ఆర్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల (బాలుర) నిర్మల్, ఏరియా హాస్పిటల్ దగ్గర, ప్రియదర్శిని నగర్, నిర్మల్  అర్హత: జూనియర్ లెక్చరర్ కు పి.జి. మరియు  బి.ఎడ్., ఫిజికల్ డైరెక్టర్ కు బి.పి.ఎడ్. మరిన్ని వివరాలకు సెల్: 9494937379ను సంప్రదించాలన్నారు.