అధ్యాపకుడి మృతిపై సంతాప సభ
27-07-2026 08:44 PM
ముకరంపుర,(విజయక్రాంతి): కాకతీయ వర్సిటీలో పని చేస్తున్న కాంటాక్ట్ కామర్స్ అధ్యాపకుడు డాక్టర్ ఓ. రవీందర్ హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయిన కారణంగా ఆయనను స్మరించుకుంటూ సంతాప సమావేశం శాతవాహన విశ్వవిద్యాలయ కామర్స్ కళాశాలలో కాంటాక్ట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మనోజ్ కుమార్, జనరల్ సెక్రెటరీ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రవీందర్ సేవలను స్మరించుకుంటూ, వారి మృతి విద్యాలోకానికి తీరని లోటు అని వారి ఆత్మకు శాంతి చేకూరాలని కాంటాక్ట్ అధ్యాపకులు అందరూ కూడా రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ వారి ఆత్మ శాంతి కొరకు ప్రార్థన చేశారు.






